![]() |
![]() |

ఖ్యాతి హిమనీ రావు అనే నెటిజన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటి అంటే ఆమె మాటల్లోనే "నేను మొన్న ఒక రీల్ పెట్టా. నందు ఈజ్ క్యూట్ అని కామెంట్ పెట్టా. దానికి అందరూ అసలు నీ ముఖం కూడా చూడడు . ఇప్పుడేంటి తన గురించి నువ్వు స్టోరీ పెడితే నీకు రిప్లై ఇచ్చేస్తాడా అని కామెంట్స్ పెట్టారు.

నాకు కోపం వచ్చింది. సో నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రీల్ కి కానీ నందు కామెంట్ పెడితే నా ఓన్ మనీతో తన కొత్త మూవీ రిలీజ్ అవుతోంది కదా అగ్లీ స్టోరీ అని దానికి నేను 10 టికెట్స్ తీసుకుని 10 మెంబర్స్ కి నేనిస్తా కాబట్టి అందరూ నందుని టాగ్ చేయండి అండ్ నందు ప్లీజ్ కామెంట్ చేయవా ప్లీజ్. నా పరువు సమస్య ప్లీజ్ అంటూ క్యూట్ గా ఒక రీల్ పెట్ట్టింది. దానికి నిజంగానే నందు మెసేజ్ చేసి ఆ రీల్ ని ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. "ఖ్యాతి ....ఇది చాలా మధురమైన అనుభూతి .. కామెంట్ మాత్రమే కాదు , నేను, గీతా ఇద్దరం కలుస్తాము అండ్ నువ్వు చెప్పిన ఆ 10 టికెట్స్ కూడా ఇస్తాము థాంక్యూ " అని రిప్లై ఇచ్చాడు. దాంతి ఖ్యాతి మళ్ళీ రి రిప్లై ఇచ్చి "ఫైనల్లీ థాంక్యూ నందు గారు నా పరువు కాపాడినందుకు కలుద్దాం అండి " అని చెప్పింది. ఇక కొంతమంది నెటిజన్స్ ఐతే నువ్వే అని గ్యారెంటీ ఏంటి మొత్తానికి సాధించావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక నందు నటించిన రీసెంట్ మూవీ అగ్లీ స్టోరీ మే 22 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. డ్రామా, రొమాన్స్, థ్రిల్లర్ మూవీలో చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కూడా నటించింది.
![]() |
![]() |